రామ్ పోతినేని, పూరీజగన్నాధ్ ల ' ఇస్మార్ట్ శంకర్ ' చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్..!!
- January 28, 2019
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని , డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.. అందం అభినయంతో ఆకట్టుకున్న నిధి అగర్వాల్ కి తెలుగులో ఇది మూడో సినిమా.. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుపుకుంటుండగా, హీరో రామ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.. రియల్ సతీష్ ఈ యాక్షన్ ఎపిసోడ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నాడు..త్వరలో నిధి అగర్వాల్ షూటింగ్ లో పాల్గొననుంది.. పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తుండగా, మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.. పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్, ఛార్మి కౌర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
నటీనటులు : రామ్ పోతినేని, నిధి అగర్వాల్, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి..
సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
సమర్పణ: లావణ్య
బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్
ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి
పాటల రచయిత: భాస్కరభట్ల
ఫైట్స్ : రియల్ సతీష్
పి.ఆర్.ఓ : వంశీ - శేఖర్
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







