తెలంగాణ:సీఎం విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

- January 30, 2019 , by Maagulf
తెలంగాణ:సీఎం విదేశీ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం మైనార్టీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు చేయూతనందించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ పథకానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మేడ్చల్ జిల్లా మైనార్టీల అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు. స్కాలర్ షిప్ కొరకు ముస్లిం, క్రిస్టియన్స్, సిక్కు, జైన్, పార్సీ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఉపకార వేతనంతో పాటు విమాన టికెట్ చార్జీలను సైతం మంజూరు చేస్తారని తెలిపారు. - డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.- జీఆర్‌ఈ, టోఫెల్, ఐలెట్స్ వంటి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. - విశ్వ విద్యాలయంలో ఆగస్టు-2018 నుంచి 2018 డిసెంబర్ వరకు ప్రవేశం పొందినవారు సంబంధిత వెబ్‌సైట్‌లో 2019 జనవరి 27వ తేదీ నుంచి 2019 ఫిబ్రవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ కార్యాలయంలో నేరుగా గానీ, 96769 89460 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com