తేజ సినిమాలో హీరో విశాల్..
- January 30, 2019
దర్శకుడు తేజ, తమిళ హీరో విశాల్ కలిసి సినిమా చేయనున్నారు. తెలుగువాడైన విశాల్ తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన నటించిన ప్రతి చిత్రం తెలుగులో అనువాదం అవుతూ విజయం సాధిస్తున్నాయి. పలు సందర్భాల్లో తెలుగులో సినిమా చేస్తాను అని విశాల్ చెప్పేవారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరిందని తెలిసింది. తేజ దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 'నేనే రాజు నేనే మంత్రి' విజయంతో తేజ ఫామ్‌లోకి వచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశారు. కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాకముందే తప్పుకున్నారు. ఆ తర్వాత బెల్లంకొడ సాయి శ్రీనివాస్, కాజల్ నటిస్తున్న సీత చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూర్తిచేశాక విశాల్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. విశాల్ కూడా తమిళంలో బిజీగా ఉన్నారు. 'టెంపర్' రీమేక్ 'ఆయోగ్య'లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్‌లో వీరి సినిమా సెట్స్‌పైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







