భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌లపై మరిన్ని ఉగ్రవాద దాడులు

- January 30, 2019 , by Maagulf
భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌లపై మరిన్ని ఉగ్రవాద దాడులు

వాషింగ్టన్‌:పాకిస్తాన్‌ మద్దతు ఇస్తున్న ఉగ్రవాద బృందాలు భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో తీవ్రదాడులు చేస్తాయని అమెరికా నిఘా సంస్థల అధికారి వెల్లడించారు. ఇండియాతో పాటు ఆఫ్గనిస్థాన్‌ పైనా దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని జాతీయ విచారణ సంస్థ డైరెక్టర్‌ డాన్‌ కోట్స్‌ వెల్లడించారు. తాలిబన్లకు వ్యతిరేకంగా అమెరికా జరుపుతున్న పోరాటానికి కూడా పాకిస్తాన్‌ సరైన సహకారాన్ని అందించడం లేదని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్‌పై 2019లో మరిన్ని దాడులు చేపట్టేందుకు పొంచివున్నారని అమెరికా హెచ్చరించింది. తాము సురక్షితంగా ఉండాలని భావిస్తున్న ఉగ్రవాదులు, తమ దేశం మద్దతుతో పొరుగు దేశాలపై దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జరిగే దాడులను తాము ఎదుర్కొంటామని తెలిపారు. సెనేట్‌ సెలక్ట్‌ కమిటీతో సమావేశమైన కోట్స్‌, సిఐఎ డైరెక్టర్‌ జెనా హాస్పెల్‌, ఎఫ్‌బిఐ డైరెక్టర్‌ క్రిస్టొఫర్‌ వారే, డిఫెన్స్‌ ఇంటెలిజెన్స్‌ ఏజన్సీ డైరెక్టర్‌ రాబర్ట్‌ ఆష్లే తదితరులతో అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సంవత్సరం మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని, వాటిని ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్నారు. జులై మధ్య కాలంలో ఆఫ్ఘనిస్తాన్‌ అధ్యక్ష ఎన్నికలు , తాలిబాన్‌ పెద్ద ఎత్తున చేపట్టనున్న దాడులు, ఉగ్రవాద బృందాలతో వ్యవహరించడంలో పాకిస్తాన్‌ తిరుగుబాటు, భారత్‌లో జరగనున్న ఎన్నికలు, మతపరమైన హింస వీటన్నింటి వల్ల దక్షిణాసియా దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు 2019లో మరింత పెరగనున్నాయని అన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com