"బూర్జ్ ఖలీఫా" తో శ్రీమంతుడు తనయుడు
- December 27, 2015
ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న "బ్రహ్మోత్సవం" సినిమా ఊటీ షెడ్యూల్ ఇటీవలే పూర్తయిన సంగతి తెలిసిందే. తదుపరి షెడ్యూల్ జనవరి మొదటి వారంలో ప్రారంభం కానుంది. దీంతో కొంత సమయం లభించడంతో మళ్ళీ తన భార్య, పిల్లలతో కలిసి టూర్ కు చెక్కేసారు. ఇటీవల తన సోదరుడి (బాబాయ్ కొడుకు) వివాహ మహోత్సవాన్ని చూసుకున్న తర్వాత ప్రిన్స్ టూర్ కు వెళ్ళిపోయారు. అయితే ఎక్కడికి వెళ్ళారోనన్న అభిమానుల సందేహాన్ని ప్రిన్స్ చేసిన తాజా ట్వీట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రిన్స్ దుబాయ్ లో తన ఫ్యామిలీతో పండగ చేసుకుంటున్నారు. దుబాయ్ లో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటిగా పేరు గాంచిన "బూర్జ్ ఖలీఫా" మబ్బులలో కలిసిపోయిందని, దుబాయ్ లో ఉన్న వాతావరణం ఇందుకు నిదర్శమని, కొడుకు గౌతమ్ హ్యండ్సప్ అన్నట్లుగా ఉన్న ఒక ఫోటోను షేర్ చేసారు. దీంతో దుబాయ్ లో ఉన్న ప్రిన్స్ అభిమానులు 'మేము ఇక్కడే ఉన్నాం. మీ చిరునామా చెప్పగలరు.' అంటూ ప్రిన్స్ ను ప్రశ్నిస్తున్నారు. అన్నట్లు. కొత్త సంవత్సరం వేడుకలను కూడా ప్రిన్స్ దుబాయ్ లోనే జరుపుకోబోతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







