నిఘా నేత్ర వ్యవస్థతో దుబాయ్ పోలీసులు వెతుకుతున్న1600 కు పైగా కార్లు పట్టివేత
- December 27, 2015
11 నెలల వ్యవధిలో నిఘా నేత్ర వ్యవస్థతో కొంత కాలంగా పోలీసులు వెతుకుతున్న1600 కు పైగా కార్లను పట్టుకోగలిగారు. ట్రాఫిక్ , చట్ట విరుద్దమైన చర్యలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న వీరిని అదుపులో తీసుకొన్నట్లు దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. తమ పెట్రోలింగ్ వాహనాల సైరన్ లైట్ల పక్కనే అమర్చిన ఈ కెమెరా వ్యవస్థ అద్భుతంగా పని చేయడంతో వీటిని తాము నిరంతరం ఇక వినియోగించనున్నట్లు ట్రాఫిక్ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సైఫ్ ముహైర్ అల్ మశ్రొఉఇ తెలిపారు. ఈ నిఘా వ్యవస్థ ద్వారా ఏ వాహనానైన చలన మ ఆచలన్ స్థితిలో వాటి లైసెన్స్ ప్లేట్ ను స్పష్టంగా చూడగలమని వివరించారు. తాము పట్టుకొన్న కార్లలో 573 మంది ట్రాఫిక్నియమాలను ఉల్లంఘించి పరారైన వారు కాగా, మిగిలిన 1091 వాహనదారులు వివిధ నేరాలకు సంబంధించిన కేసులను కల్గి ఉన్నవారు కావడం గమనార్హమన్నారు. నిఘా నేత్ర వ్యవస్థతో గత 11 నెలల కాలంలో వెతుకుతున్న 1664 కార్లను సులువుగా పట్టుకొన్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









