భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్ తప్పనిసరి: నేపాల్
- February 06, 2019
ఖాట్మండు: భారతీయ కార్మికులకు వర్క్ పర్మిట్ తప్పనిసరి చేస్తూ నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడి పరిశ్రమలు, సంస్థల్లో పనిచేసేందుకు వెళ్లే కార్మికులకు ఈ అనుమతులను తప్పనిసరి చేసింది. నేపాల్ ప్రభుత్వ కార్మిక, వృత్తి భద్రత విభాగం దేశ వ్యాప్తంగా ఉన్న లేబర్ కార్యాలయాలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల వాస్తవ సంఖ్యను గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఈ గణనలో వర్క్ పర్మిట్ లేకుండా భారతీయులు సంస్థల్లో పనిచేస్తుంటే సంబంధిత సంస్థకు తెలియజేసి వారిని అనుమతులు తీసుకోవాల్సిందిగా చెప్పాలన్నారు. ఇరు దేశాల సంబంధాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఇటువంటి నియమాలు ఏవీ అమల్లో లేవు. దేశ సరిహద్దు రక్షణలో భాగంగా ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపట్టినట్లుగా సమాచారం. గత నెలలో నేపాల్ రాష్ట్ర బ్యాంకు భారతీయ కరెన్సీ రూ. 200, రూ. 500, రూ.2000 నోట్లను రద్దు చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..