మొదటి టీ20లో టీంఇండియా ఓటమి
- February 06, 2019
భారత్ -న్యూజిలాండ్ టి20 సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న తొలి టి20లో టీంఇండియా 80 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.2 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత ఇన్సింగ్స్ లో ధోని 39, శిఖర్ ధావన్ 29, విజయ్ శంకర్ 27, పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌధీ3, ఫెర్గ్యూసన్, సాంట్నర్, సోథీ తలా రెండు వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219పరుగులు చేసింది. టిమ్ సీఫర్ట్ 84, మన్రో 34, విలియమ్ సన్ 34, టేలర్ 23పరుగులతో రాణించడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..