'ఆరు నెలల నిషేధం' ఎత్తివేత
- December 27, 2015
ఉద్యోగ సంస్థకు, ఉద్యోగికీ మధ్య పరస్పర అవగాహనతో ఒప్పందాల్ని రద్దు చేసుకుంటే, వారిపై ఆరు నెలల నిషేధం ఇకపై నుంచి ఎత్తివేస్తున్నట్లు యూఏఈ లేబర్ మినిస్ట్రీ వెల్లడించింది. 2016 జనవరి నుంచి ఈ కొత్త వెసులుబాటు అమల్లోకి రానుంది. ఇక నుంచి ఓ చోట పని మానేసినవారు, వెంటనే ఇంకో చోట పని వెతుక్కోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే లెవెల్ 4 మరియు 6 కిందకు వచ్చే వారికి మాత్రం ఈ వెసులుబాటు వర్తించదు. ఈ కొత్త రూల్‌ని అమల్లోకి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లను లేబర్ మినిస్ట్రీ ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ - అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హమాయిద్ రషీద్ బిన్ దిమాస్ అల్ సువైది మాట్లాడుతూ, ఈ కొత్త నిర్ణయం ఒప్పందం ప్రకారం రెండేళ్ళు ఒకే చోట పనిచేయాలనే అగ్రిమెంట్ చేసుకున్నవారు కూడా, సంస్థ అనుమతితో ఒప్పందం రద్దు చేసుకుని, వెంటనే తమకు నచ్చిన వేరే సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు. టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చామని మినిస్ట్రీ వెల్లడించింది. అలాగే ఇతర దేశాల నుంచి వర్కర్లను తెచ్చుకోవడం కాకుండా, స్వదేశంలోనే టాలెంట్ ఉన్న వర్కర్లను ఎంరేజ్ చేయడానికి మినిస్ట్రీ ప్రయత్నిస్తోందని సవైది చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







