పుల్వామా ఉగ్రదాడి మాపనే:జైషే మహమ్మద్

- February 15, 2019 , by Maagulf
పుల్వామా ఉగ్రదాడి మాపనే:జైషే మహమ్మద్

పుల్వామా ఉగ్రదాడి తమదేనంటూ ఇప్పటికే జైషే మహమ్మద్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజార్‌!. మసూద్‌కు భారత్‌ అంటే నిలువెల్లా విద్వేషం. గతంలో అజార్‌ను కేంద్రం అరెస్ట్‌ చేసినా….. 1999లో ఇండియన్‌ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసి… మరీ ఇతన్ని విడిపించుకున్నారు ఉగ్రవాదులు. అలా నిర్బంధం నుంచి బయటపడ్డ మసూద్‌ తరువాత జైష్‌ ఏ మహమ్మద్‌ ఉగ్రసంస్థను నెలకొల్పాడు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టాలన్న కుట్రతో అనేక ఉగ్రదాడులను నిర్వహించాడు. పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి, పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, ఉరీ సైనికస్థావరంపై దాడి.. ఇలా పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో మసూద్‌దే మాస్టర్‌ మైండ్‌..

సభ్యదేశంగా ఉన్న చైనా అనేక సార్లు అడ్డుకుంది. 2001 పాక్‌లోని ఉగ్రవాదులకు ఆ దేశ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా చైనా కూడా అండనివ్వడం గమనార్హం. భద్రతామండలిలో 15 దేశాలు ఉంటే చైనా ఒక్కటే అడ్డుపడటంపై అంతర్జాతీయంగా విస్మయం వ్యక్తమవుతోంది.

చైనాకు పాక్‌తో వాణిజ్యపరంగా దృఢమైన సంబంధాలు ఉన్నాయి. చైనా, పాక్‌ ఆర్థిక నడవాకు చైనా భారీ నిధులు సమాకూరుస్తోంది. భారత్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ తమకు సవాల్‌గా మారకూడదన్నదే చైనా విధానం. అందులో భాగంగా భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా…మసూద్‌ను పెంచిపోషిస్తోంది డ్రాగన్‌ కంట్రీ! చైనా అండతో…. మసూద్‌ అజార్‌ రోజురోజుకు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు పుల్వామాలో ఉగ్రదాడికి స్కెచ్‌ వేసి…. ఏకంగా 44 మందికిపైగా పొట్టనపెట్టుకున్నాడు.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com