హర్భజన్‌సింగ్ సొంత పార్టీ..
- December 28, 2015
భారత సంతతికి చెందిన హర్భజన్‌సింగ్ సొంత పార్టీని స్థాపించాడు. ఇప్పటిదాకా తాను పనిచేసిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) ఇమ్మిగ్రేషన్ విధానం నచ్చకపోవడంతో ఓపెన్ బోర్డర్స్ పార్టీ (ఓబీపీ) అనే పార్టీని ఏర్పాటుచేశాడు. బర్మింగ్ హాంలోని పెర్రీబార్ నియోజకవర్గానికి ఎంపీ అయిన సింగ్...దేశంలోకి అందరికీ ప్రవేశం కల్పించాలని బ్రిటన్‌ను డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని బర్మింగ్‌హామ్ అనే పత్రిక శనివారం వెల్లడించింది. 'యూరోపియన్ యూనియన్ (ఈయూ)ని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నా. అయితే స్వేచ్ఛావాదినైనందువల్ల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలనే విశ్వసిస్తా.'అని అన్నారు. అంటువ్యాధులు, నేరచరిత్ర లేనివారికి సేచ్ఛగా ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశాడు.ఇది ఆర్థిక వ్యవస్థ బలపడేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







