అభిమానులకు షాకిచ్చిన తలైవా!
- February 17, 2019
సూపర్‌స్టార్ రజనీకాంత్ అభిమానులకు షాకిచ్చారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు రజనీ. అంతే కాదు తాను ఏ పార్టీకి మద్దతు కూడా తెలపనని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేయబోతున్నట్లు తెలిపారు రజనీకాంత్. తన అభిమాన సంఘాలు కానీ, ఇతర పార్టీ వర్గాలు కానీ ప్రచారం కోసం తన పేరును వాడుకోవద్దని హెచ్చరించారు. తమిళనాడుకు నీటి సమస్యలు లేకుండా చేసే పార్టీకే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు.
రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. రజనీ మక్కల్ మండ్రమ్ అనే అభిమాన సంఘం పేరిట తన రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు పార్టీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కానీ తాజా ప్రకటనతో అభిమానుల్లో నిరాశ నెలకొంది.
రజనీ కాంత్ పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు? పార్టీ పేరేంటి? దాని విధి విధానాలేంటి అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..