దుబాయ్:ఘనంగా ఆసియా విజన్ అవార్డుల వేడుక
- February 17, 2019
దుబాయ్: దుబాయ్‌లోని గ్లోబల్ విలేజ్ లో ఆసియా విజన్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. గత ఏడాది భారత చిత్ర పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. 2006 నుంచి ఈ ఆసియా విజయ్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ఫిబ్రవరి 16న 13వ ఆసియా విజన్ వేడుక జరిగింది.
ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ధనుష్, రణ్‌వీర్ సింగ్, త్రిష, విజయ్ సేతుపతి, కియారా అడ్వాణీ, ఆయుష్మాన్ ఖురానా, మంజూ వారియర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో త్రిష 'యాక్ట్రెస్ ఆఫ్ ది డికేడ్' అవార్డు అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో నటులు రణ్‌వీర్, ధనుష్ కూడా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'గల్లీబాయ్'తో కలిసి దిగిన ఫొటోలను త్రిష సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్న వారి జాబితాను పరిశీలిస్తే..
ఉత్తమ నటుడు (బాలీవుడ్): రణ్‌వీర్ సింగ్ (పద్మావత్)
ఉత్తమ నటుడు (దక్షిణాది): విజయ్ సేతుపతి (విక్రమ్ వేద).
ఉత్తమ నటి: ఆశా శరత్ (భయానకం).
ఉత్తమ ప్రతినాయకుడు: జిమ్ సర్బ్ (పద్మావత్).
ఉత్తమ నటుడు (బాలీవుడ్-క్రిటిక్): ఆయుష్మాన్ ఖురానా (బదాయి హో/
ధాధున్).
ఉత్తమ నటుడు (దక్షిణాది-క్రిటిక్): ధనుష్ (వడ చెన్నై/మారి 2).
బెస్ట్ యాక్ట్రెస్ ఆఫ్ ది డికేడ్: త్రిష.
ఉత్తమ ప్రదర్శన: సద్నా వెంకటేశ్ (పేరాంబు).
స్టార్ ఆఫ్ ది ఇయర్: ఐశ్వర్య లక్ష్మి (వరతన్).
ఎమర్జింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్: కియారా అడ్వాణీ.


తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







