వెదర్ అప్‌డేట్: యూఏఈలో కొనసాగనున్న వర్ష వాతావరణం
- February 18, 2019
యూఏఈ రెసిడెంట్స్ ఈ వారంలో మరింతగా వర్షాల్ని చూసే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ పేర్కొంది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా వర్షాలు కురుస్తుండడంతో దాదాపుగా యూఏఈ అంతటా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఇంటర్నల్ ఏరియాస్‌లో 17 డిగ్రీలకు అత్యల్ప ఉష్ణోగ్రతలు తగ్గగగా, జబెల్ జెయిస్‌లో 9.9 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తాజా గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుందనీ, అయితే సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, సముద్రం రఫ్‌గా వుంటుందని ఎన్‌సిఎం పేర్కొంది. దుబాయ్, అబుదాబీ, అజ్మన్, అల్ అయిన్, ఫుజారియా, షార్జా మరియు రస్ అల్ ఖైమాలో కొన్ని చోట్ల వర్షాలు బాగానే కురిశాయి. రస్ అల్ ఖైమాలోని పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని చోట్ల చెట్లు, పోల్స్ విరిగిపోయాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







