పాకిస్తాన్ కు లక్షన్నర కోట్లు ఇచ్చిన సౌదీ యువరాజు
- February 18, 2019
ఇస్లామాబాద్: ఆర్థిక కష్టాల్లో మునిగి కిందా మీదా పడుతున్న పాకిస్థాన్‌ను సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆదుకున్నారు. ఏకంగా 2000 కోట్ల డాలర్లు (సుమారు రూ.లక్షన్నర కోట్లు) పెట్టుబడులు పెట్టడానికి ఆయన పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అసలే కష్టాల్లో ఉన్న మన దాయాది దేశానికి ఇది గొప్ప ఆఫరే. దీంతో అనుకున్నదే తడువుగా ఆయనకు పాకిస్థాన్ అత్యున్నత పౌర పురస్కారం నిషానె పాకిస్థాన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి.. సల్మాన్‌కు ఈ అవార్డు అందజేయనున్నారు. పాక్‌లో ఆ అవార్డు అందుకున్న తర్వాత సల్మాన్ ఇండియా పర్యటనకు రానుండటం విశేషం. తీవ్రమైన ఆర్థిక లోటుతో పాక్ సతమతమవుతున్నది. కొన్ని రోజులుగా భారీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నది. ఈ సమయంలో సౌదీ భారీ మొత్తం పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. పుల్వామా దాడి పాకిస్థాన్ పనే అని ఇండియా ఆరోపిస్తున్న సమయంలో సౌదీ యువరాజు పాక్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







