డబ్బిస్తే అనుకూల ట్వీట్లు... స్టింగ్ ఆపరేషన్లో దొరికిన బడా సెలెబ్రిటీలు
- February 20, 2019
మీరు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నారా? ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సెలబ్రిటీలను ఫాలో అవుతున్నారా? అయితే వారి నుంచి వచ్చే ట్వీట్లను ఎప్పుడైనా గమనించారా? అప్పుడప్పుడూ కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు అనుకూలంగా, పొగుడుతూ పోస్టులు పెడుతుంటారు. నిజమేనేమో.. వాళ్లంటే ఈ సెలబ్రిటీలకు ఎంత అభిమానమో, గౌరవమో అనుకుంటాం.
కాని ఇలాంటి పోస్టులలో చాలా వరకు పెయిడ్ పోస్టులే అని ఒక స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైంది. ఇలాంటి అనుకూలమైన పోస్టులు పెట్టడానికి లక్షల రూపాయలు తీసుకుంటారని తెలిసింది. స్టింగ్ ఆపరేషన్లు చేయడంలో దిట్ట అయిన 'కోబ్రా పోస్ట్' అనే సంస్థ బాలీవుడ్ తారల అసలు గుట్టు విప్పేసింది. దీనికి 'ఆపరేషన్ కరావోకే' అనే పేరు పెట్టింది.
ఒక పబ్లిక్ రిలేషన్ ఏజన్సీ (పీఆర్ ఏజెన్సీ) తరపున వచ్చామంటూ కోబ్రా పోస్ట్ ప్రతినిధులు 36 మంది బాలీవుడ్ నటులు, గాయకులను కలిశారు. వీరిలో జాకీష్రాఫ్, సోనూసూద్, వివేక్ ఓబెరాయ్, శక్తి కపూర్, అమీషా పటేల్, రాఖీ సావంత్, సన్నీలియోన్, గాయకులు కైలాష్ ఖేర్, మికా సింగ్, బాబా సెహగల్ ఇలా చాలా మంది ఉన్నారు.
మీరు పలువురు రాజకీయ నాయకులకు, పార్టీలకు అనుకూలంగా మీ సొంత అభిప్రాయం అనిపించేలా పోస్టు చేయండి మేం మీకు డబ్బు ఇస్తాం అని వారిని కలిశారు. ఒక్కో పోస్టుకు 2 నుంచి 50 లక్షల వరకు చెల్లిస్తామని కూడా ఆఫర్ చేశారు. దానికి సదరు నటులు సానుకూలంగా స్పందించారు. ఇక సోనూ సూద్ 8 నెలల కాంట్రాక్టుకు 20 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు.
మినిషా లాంబా వంటి నటులు క్యాష్ రూపంలో (అంటే బ్లాక్ మనీ) కావాలని కోరారు. అంతగా మీరు జీఎస్టీ చెల్లించాలనుకుంటే 80 శాతం బ్లాక్ మనీ ఇచ్చి మిగతాది మీ ట్యాక్స్ కోసం వైట్‌లో చెల్లించమని సలహా కూడా ఇచ్చింది.
ఇక ఇదే సంస్థ అర్షద్ వార్సీ, విద్యాబాలన్, రజా మురద్, సౌమ్యా టాండన్ వంటి వారిని సంప్రదిస్తే ఇలాంటి పనులు మేం చేయమని నిరాకరించారు. నిన్న ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో కోబ్రా పోస్ట్ ప్రతినిధులు దీనికి సంబంధించిన 60 నిమిషాల వీడియో డాక్యుమెంటరీని విడుదల చేశారు.
ఈ విషయం తెలిసిన వెంటనే బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేగింది. ట్విట్టర్‌లో ఆపరేషన్ కరావోకే పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







