పాక్ కి వర్మ పంచ్.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
- February 21, 2019
పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు 40 మందికిపైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. పాక్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. పాక్ కి తీవ్ర హెచ్చరికలు చేశారు. ఐతే, ఈ ఘటనపై ఇటీవల ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. 'పుల్వామా దాడికి తమను నిందించడం సరికాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తమపై ఆరోపణలు చేస్తోంది. సమస్యలను చర్చలతోనే పరిష్కరించుకోవాలి' అని అన్నారు. తాజాగా, ఇమ్రాన్ వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్ వేదికగా స్పందించారు.
'డియర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్.. చర్చలతోనే సమస్యలు పరిష్కారమయ్యేటట్లైతే.. మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు కదా.. ఓ వ్యక్తి ఆర్డీఎక్స్ పట్టుకుని మావైపు పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అతనితో చర్చలు ఎలా జరపాలో మా భారతీయులకు నేర్పించండి సర్. నేర్పించినందుకు మీకు ట్యూషన్ ఫీజు కూడా చెల్లిస్తాం సర్. మీ దేశంలో ఒకప్పుడు ఒసామా బిన్‌లాడెన్ ఉన్నాడని అమెరికాకు తెలిసినప్పుడు మీకెందుకు తెలీదు? కనీసం మీ దేశంలో ఎవరు ఉంటున్నారో కూడా తెలీనప్పుడు అదీ ఓ దేశమేనా? నాకు తెలీక అడుగుతున్నాను సర్.. ప్లీజ్ చెప్పండి. జైషే మహమ్మద్, లష్కరే, తాలిబన్, ఆల్‌ఖైదా సంస్థలు మీ ప్లే స్టేషన్స్ కాదని నాకు ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఆ సంస్థలకు వ్యతిరేకమని మీరూ ఎప్పుడూ చెప్పలేదు. మీకు బాంబులు క్రికెట్ బంతుల్లా కనిపిస్తున్నాయా సర్..' అంటూ తనదైన శైలిలో పాక్ ప్రభుత్వానికి చురకలంటించారు రాంగోపాల్ వర్మ.
ఇన్నాళ్లు వర్మ చేసే వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన వచ్చేది. పబ్లిసిటీ కోసం వర్మ ఎలాంటి వ్యాఖ్యలైనా చేస్తారని చెప్పుకొనేవారు. ఐతే, పాక్ ప్రధానికి వర్మ ఇచ్చిన కౌంటర్ అదిరిపోయిందంటూ ప్రశంసలు కురుస్తున్నాయ్. శభాష్.. వర్మ.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







