శుభ్రత పాటించట్లేదని 5వేల రెస్టారెంట్లను..
- February 23, 2019
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే నిమిషాల్లో నీట్‌గా ప్యాక్ చేసి ఉన్న పార్సిల్ మీముందుంటుంది. వాళ్లు ఎలా చేసారో.. శుభ్రత పాటిస్తారో లేదో ఇలాంటివి ఏవీ గుర్తుకు రావు. ఫుడ్ రాగానే టేస్టీగా ఉందని లొట్టలేసుకుంటూ తినేస్తుంటాము. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని రెస్టారెంట్లు ప్రమాణాలు పాటించట్లేదని గుర్తించారు.
శుభ్రత విషయంలో అశ్రద్ధ కనబరుస్తున్నారని గుర్తించింది ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ. ఎఫ్ఎష్ఎస్ఏఐ ప్రమాణాలను పాటించని 5,000 రెస్టారెంట్లను తమ ప్లాట్‌ఫామ్‌పై నుంచి తొలగిస్తున్నట్లు ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో పేర్కొంది. ఇప్పటి వరకు నమోదైన 150 నగరాల్లోని 80 వేలకు పైగా రెస్టారెంట్లను ఆడిట్ చేస్తున్నామని తెలిపింది. పరిశుభ్రత పాటించని రెస్టారెంట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు అమలు చేయకపోతే డిలీట్ చేస్తామని జొమాటో సీఈఓ మోహిత్ గుప్తా తెలిపారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







