డేటా సైన్స్, అనలిటిక్స్‌లో 97 వేల ఉద్యోగాలు..
- March 01, 2019
ప్రతి సంవత్సరం వందల మంది విద్యార్థులు క్యాంపస్‌ల నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఏదో ఒక కోర్సు కాకుండా ఏ కోర్సు చేస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఏ విభాగాలవైపు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి అనేది ఒక అవగాహనకు వస్తే మంచిది. దాన్ని బట్టి ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు.
ఆయా విభాగాల్లో గట్టి పట్టుని సాధిస్తే ఆ ఉద్యోగం వారినే వరిస్తుంది. కొన్ని ఉద్యోగాలకు ఒక్క పోస్టుకి వందల దరఖాస్తులు వస్తుంటాయి. మరికొన్నింటికి సరైన స్కిల్స్ ఉన్న అభ్యర్థులు లభించరు. ఇలాంటివే అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగాలు. వీటిల్లో ప్రతిభావంతుల కొరత కారణంగా దాదాపుగా 97,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆనలైన్ ఎడ్‌టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
అనలిటిక్స్, డేటా సైన్స్ విభాగాల్లో డిమాండ్ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. అయితే నైపుణ్యం కలిగిన నిపుణులు మాత్రం కరువయ్యారు. ఇప్పుడు కంపెనీలు ఈ అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో గత ఏడాది ఈ విభాగానికి చెందిన ఉద్యోగాలు 45 శాతం మేర పెరిగాయి. ఈ విభాగాల్లో అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి 31 శాతం ఉద్యోగాలు సిద్ధంగా ఉంటే, ఫ్రెషర్లకు 21 శాతం ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలు ఐటీ కారిడార్ బెంగళూరులో 24 శాతం ఉన్నాయి. ఇక ఢిల్లీలో 22 శాతం, ముంబయిలో 15 శాతం, చెన్నైలో 7 శాతం అనలిటిక్స్ ఉద్యోగాలు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫార్మా, ఈ-కామర్స్, వాహన రంగాల్లో అనలిటిక్స్, డేటా సైన్స్ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. వీరికి వేతనాలు కూడా బాగానే ఉంటున్నాయి. అనుభవాన్ని బట్టి సంవత్సరానికి 11.5 లక్షల జీతం ఇస్తున్నాయి కంపెనీలు. అంటే నెలకు దాదాను రూ.92,000 వేతనం లభిస్తుంది.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







