కాలేయం... కాపాడుకోవడం ఎలా?
- March 02, 2019
మానవ శరీరంలో గుండె ఆరోగ్యం ఎంత ముఖ్యమో కాలేయాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మనం సరైన ఆహారం తీసుకోకపోవడం, అతిగా తినడం, మద్యం అలవాట్లు, నూనెతో చేసిన పదార్దాలను ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాల వల్ల కాలేయం దెబ్బ తినే అవకాశం ఉంటుంది.
కాలేయానికి డ్యామేజ్ జరిగితే అనేక రకములైన అనారోగ్య సమస్యల తలెత్తుతాయి. అలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
1. రాత్రి పూట త్వరగా పడుకొని... ఉదయాన త్వరగా నిద్రలేవాలి. ఇలా చేస్తే లివర్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు.
2. ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. అంతేకాకుండా ఉదయం అల్పాహారం చేయడం అసలు మానేయకూడదు. లేదంటే లివర్ పైన ఒత్తిడి పెరుగుతుంది.
3. అతిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి లివర్‌కు ఎక్కువ సమయం పట్టడమే కాదు... అదనపు భారం కూడా పడుతుంది.
4. మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.
5. సరైన నూనె వాడకుండా వండిన ఆహారం తిన్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. నాణ్యత కలిగిన నూనెను మాత్రమే వంటకాలకు ఉపయోగించాలి.
6. మద్యం సేవించడం కూడా లివర్ నాశనానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మద్యాన్ని పూర్తిగా మానేయడమే మంచిది.
7. ఆహారాన్ని సరిగా ఉడికించకుండా తింటే లివర్‌పై భారం పెరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఉడికిన ఆహారాన్ని మాత్రమే తినాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







