ఏం చేద్దాం ?!

ఏం  చేద్దాం ?!

నిన్నూ 
నన్నూ 
వేరు చేస్తున్న ఓ సన్నని దారం 

ఉగ్రవాదాన్ని తిడుతూ నేను 
యుద్ధాన్ని తిడుతూ నువ్వు 

రెండు దారులూ 
మంచిని  కోరుకుంటూ

మట్టిని, మట్టే కదా అని 
నేను  నిందించనూ లేను 
నువ్వు ప్రేమించనూ లేవు 
అవును
మనిషే ముఖ్యం 
నీకైనా నాకైనా 
కాదన్నదెవ్వరు

అనుకోని సమయం 
రానే వచ్చింది 
సైన్యాన్ని  వెంటెట్టుకుని

నల్లని నీడలు  నవ్వుతున్నాయి
స్వప్నాలను ధ్వంసం చేస్తూ 
ముంచుకొస్తున్న మృత్యువుకు 
ఇద్దరమూ ఒక్కటే నేస్తం
ఇప్పుడేం చేద్దామో నువ్వే చెప్పు 

--పారువెల్ల

Back to Top