ఇండియన్ రైల్వే లో ఉద్యోగ అవకాశాలు

- March 02, 2019 , by Maagulf
ఇండియన్ రైల్వే లో ఉద్యోగ అవకాశాలు

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ రైల్వే జోన్ల పరిధిలో నాన్‌టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ) పోస్టుల భర్తీకి గురువారం (ఫిబ్రవరి 28) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి శుక్రవారం (మార్చి1) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 
పోస్టుల వివరాలు..
మొత్తం పోస్టులు : 35,277
అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు: 10,628
గ్రాడ్యుయేట్ పోస్టులు : 24,649
వాటి వివరాలు..
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 4319
అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 760
జూనియర్ టైమ్ కీపర్ : 17
ట్రైన్ క్లర్క్: 592
కమర్షిల్ కమ్ టికెట్ క్లర్క్: 4940
ట్రాఫిక్ అసిస్టెంట్: 88
గూడ్స్ గార్డ్: 5748
సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 5638
సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 2873
జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్: 3164
సీనియర్ టైమ్ కీపర్: 14
కమర్షియల్ అప్రెంటిస్ : 259
స్టేషన్ మాస్టర్ తదితర పోస్టులు: 6865
అర్హత: అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) పోస్టులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. గ్రాడ్యుయేట్ పోస్టులకు కనీస విద్యార్హత డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నిర్దిష్ట వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి. 
వయసు: 01.07.2019 నాటికి యూజీ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య, డిగ్రీ స్థాయి పోస్టులకు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
ఎంపిక విధానం : ఆన్‌లైన్ రాత పరీక్ష ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు, ఈబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, ట్రాన్స్‌జెండర్, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. జనరల్ అభ్యర్థులకు మొదటి విడత రాత పరీక్ష సమయంలో పరీక్షకు హాజరైన వారికి రూ.400 తిరిగి చెల్లిస్తారు. మిగతా అభ్యర్థులకు రూ.250 తిరిగి చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల : 28.02.2019
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2019
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2019
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఆన్‌లైన్ ద్వారా 05.04.2019 (నెట్ బ్యాంకింగ్/ క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/యూపీఐ) 
ఎస్‌బీఐ చలాన్, పోస్టాఫీస్ చలాన్ ద్వారా : 05.04.2019
దరఖాస్తుల తుది సమర్పణకు చివరి తేదీ: 12.04.2019
రాతపరీక్ష తేదీ (సీబీటీ): జూన్- సెప్టెంబరు మధ్య కాలంలో

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com