మరోసారి బయటపడిన పాకిస్తాన్ నిజస్వరూపం..
- March 02, 2019
పాక్ నిజస్వరూపం మరోసారి బయటపడింది. గత కొంత కాలంగా ఉగ్రవాదులతో తమకు సంబంధాలు లేవని నంగనాచి మాటలు చెప్పిన పాక్…మొన్న భారత్‌లో ఉగ్రదాడుల సూత్రధారి, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ తమ దేశంలోనే ఉన్నట్లు అంగీకరించింది. తాజాగా అతనితో పాక్ ప్రభుత్వం టచ్‌లో ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రే వ్యాఖ్యనించడంతో పాక్ అసలు ముసుగు తొలగిపోయింది.
పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషి ఓ అంతర్జాతీయ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో… మసూద్‌కు తమ దేశంతో ఉన్న సంబంధాలకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు. నిషేధిత ఉగ్రసంస్థ జైషే సంస్థ నాయకులతో పాక్ ప్రభుత్వం టచ్‌లోనే ఉందని ఆయన అంగీకరించారు. జైషే ఉగ్రవాద సంస్థ నాయకులను సంప్రదించామని, పుల్వామా ఉగ్రదాడికి తాము పాల్పడలేదని ఆ సంస్థ తమతో చెప్పినట్లు తెలిపారు ఖురేషీ.
పుల్వామా దాడి గురించి జైషే ఉగ్రసంస్థ నాయకులను తమ ప్రభుత్వం సంప్రదించిందని…అయితే ఆ దాడి తాము చేయలేదని చెప్పారని అన్నారు. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటికే జైషే సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జైషే సంస్థ తప్పు లేదని పాక్ మంత్రి వత్తాసు పలకడం చూస్తే..ఉగ్రవాద సంస్థలకు పాక్ ప్రభుత్వం ఎలా పెంచి పోషిస్తుందో దీన్ని బట్టే అర్థం అవుతోంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







