రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- March 02, 2019
యూఏఈలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్ అల్ కువైన్లోని ఎతిహాద్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తస్హీల్ సెంటర్ దగ్గరలో రోడ్డు దాటుతుండగా, వాహనం అతనిపైకి దూసుకెళ్ళిందని ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డిపార్ట్మెంట్ - యూఏక్యూ పోలీస్ డైరెక్టర్ కల్నల్ సయీద్ ఒబైద్ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్ ఘటనా స్థలికి చేరుకోవడం జరిగింది. తీవ్ర గాయాలతో వున్న బాధితుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రి వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డుపై అప్రమత్తంగా వ్యవహరించాలనీ, రోడ్డు దాటే క్రమంలో పాదచారులూ జాగ్రత్తగా వుండాలని కల్నల్ సయీద్ ఒబైద్ సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







