భారత సబ్‌మెరైన్‌ని అడ్డుకున్న పాకిస్తాన్‌

- March 05, 2019 , by Maagulf
భారత సబ్‌మెరైన్‌ని అడ్డుకున్న పాకిస్తాన్‌

తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిందంటూ భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామి (సబ్‌మెరైన్‌)ని పాకిస్తాన్‌ అడ్డుకుంది. ఇటీవల భారత్‌ - పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 'మా ప్రాదేశిక జలాల్లోకి భారత జలాంతర్గామి వచ్చేందుకు ప్రయత్నించింది. దాన్ని మేం అడ్డుకున్నాం. గతంలో కూడా ఓ సారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది' అని పాకిస్తాన్‌ నేవీకి చెందిన అధికార ప్రతినిథి వెల్లడించారు. భారత్‌తో ఎలాంటి వైరం పెట్టుకునే ఉద్దేశ్యం తమకు లేదనీ, శాంతియుత ఆలోచనలతోనే తాము ఆ జలాంతర్గామిని టార్గెట్‌ చేయలేదని తెలిపారాయన. గతంలో, అంటే 2016లో ఇలాంటి ఘటన జరిగింది. ఇదిలా వుంటే, భారత నావికా దళం, పాకిస్తాన్‌ ఆరోపణల్ని తిప్పికొట్టింది. అలాంటి ఘటన ఏదీ జరగలేదని పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com