ఇమ్మోరల్‌ వీడియోస్‌: ఒమనీ జాతీయుడి అరెస్ట్‌

- March 05, 2019 , by Maagulf
ఇమ్మోరల్‌ వీడియోస్‌: ఒమనీ జాతీయుడి అరెస్ట్‌

మస్కట్‌: సోషల్‌ మీడియా వేదికగా ఇమ్మోరల్‌ ఫొటోస్‌, వీడియోస్‌ని షేర్‌ చేస్తున్న ఒమన్‌ జాతీయుడ్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఓ ఒమన్‌ పౌరుడు అలాగే ఓ వలస మహిళకు చెందిన వీడియో సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవడంపై దృష్టిపెట్టిన అధికారులు, అత్యంత వ్యూహాత్మకంగా నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. సుల్తానేట్‌ని విడిచి వెళ్ళిన తర్వాత ఆ మహిళ ఈ వీడియోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినట్లు గుర్తించారు. సిటిజన్‌ని గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పబ్లిక్‌ మొరాలిటీని దెబ్బతీసేలా వీడియోలు, ఫొటోలు వున్నాయని పోలీసులు తెలిపారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు 3 నెలల నుంచి 3 ఏళ్ళ వరకు జైలు శిక్ష 100 ఒమన్‌ రియాల్స్‌ నుంచి 3000 ఒమన్‌ రియాల్స్‌ వరకూ జరీమానా విధించేందుకు అవకాశముంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com