'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు క్లియరెన్స్ ఇచ్చిన నందమూరి ఫ్యామిలీ!
- March 11, 2019
వచ్చేవారం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కాబోతున్న నేపధ్యంలో ఈమూవీ సెన్సారింగ్ కార్యక్రమాలు మరొక రెండు మూడు రోజులలో పూర్తి అయ్యే విధంగా ముందుగానే వర్మ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సెన్సార్ విషయంలో అడ్డంకులు క్రియేట్ చేయాలని అదేవిధంగా ఈమూవీ విడుదలను అడ్డుకుంటూ మన తెలుగు రాష్ట్రాలలోని హైకోర్ట్లులలో పిల్స్ వేయాలి అన్న ఆలోచనలు చేసిన నందమూరి ఫ్యామిలీలో మార్పు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి వర్మ తీస్తున్న కథ లక్ష్మి పార్వతి జీవితం చుట్టూ అల్లబడిన ఎన్టీఆర్ చివరిరోజుల జీవితానికి సంబంధించిన కథ కాబట్టి ఆమె అభ్యంతరాలు చెప్పకుండా కేవలం నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అభ్యంతరాలు చెపితే ఎంత వరకు కోర్ట్ అంగీకరిస్తుంది అన్న సందేహాలు న్యాయనిపుణులు కూడ నందమూరి ఫ్యామిలీ సభ్యులతో చెప్పినట్లు సమాచారం. దీనితో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ఆపుచేయమని ఆవేశంగా కోర్ట్ కు వెళ్లి అక్కడ తమ వాదన నెగ్గకపోతే అది మరింత అవమానంగా ఉంటుంది అన్న అభిప్రాయంలో ప్రస్తుతం చాలామంది నందమూరి కుటుంబ సభ్యులు ఉన్నట్లు టాక్.
దీనికితోడు ఎన్నికలు కేవలం ఒక నెలరోజులు కూడ లేని నేపధ్యంలో వర్మ గురించి అదేవిధంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ గురించి ఎక్కువగా పట్టించుకోవడం మంచిది కాదని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీని టార్గెట్ చేస్తూ ఎటువంటి లీగల్ ఆలోచనలు చేయవద్దనీ నందమూరి కుటుంబానికి తెలుగుదేశం అధినాయకత్వం నుండి స్పష్టమైన సలహాలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో ఎటువంటి సమస్యలు సృష్టించకుండా వర్మను కూల్ గా వదిలివేయడం మంచిది అనీ లేకుంటే వర్మ ఎన్నికల వేళ నందమూరి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మీడియా ముందుకు వస్తే ఈ ఎన్నికల సమయంలో నందమూరి కుటుంబం పై ఏర్పడే నెగిటివ్ ఫీలింగ్ తెలుగుదేశం పార్టీకి చాల కీడు చేస్తుందని తెలుగుదేశంలోని కొందరు కీలక నాయకులు ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులకు స్పష్టం చేసినట్లు టాక్. దీనికితోడు కేవలం హడావిడి తప్ప వర్మ ఈమూవీలో అందరికీ తెలిసిన విషయాలే పేర్లు మార్చి మళ్ళీమళ్ళీ చెపుతున్న నేపధ్యంలో ఈమూవీ విషయంలో ఆందోళన పడటం కంటే పట్టించుకోకుండా ఉండే స్ట్రాటజీ అనుసరిస్తే తమకు అన్నివిధాల మంచిది అన్న నిర్ణయానికి నందమూరి ఫ్యామిలీ వచ్చిన నేపధ్యంలో ఈమూవీ విషయంలో వర్మ కోరుకునే ఫ్రీ పబ్లిసిటీ పోయిందనే అనుకోవాలి..
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







