బోయింగ్స్ రద్దు
- March 14, 2019
ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన ప్రమాదం తర్వాత, ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా విమానాల్లో ప్రయాణించేందుకు ప్రయాణీకులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని పలు సంస్థలు, తమ విమానాల్ని రద్దు చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, ఇండియా, అమెరికా కూడా బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమాన సేవల్ని నిలిపివేశాయి. ఇథియోపియా, సింగపూర్, చైనా, ఫ్రాన్స్, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇండోనేసియా, మలేసియా ఈ విమాన సేవల్ని నిలిపివేసినట్లు ప్రకటించాయి. యూఏఈ జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ సైతం ఈ విమాన యాన సేవల్ని నిలిపివేసినట్లు ప్రకటించిన విషయం విదితమే. తదుపరి నోటీసు ఇచ్చేవరకు యూఏఈ ఎయిర్ స్పేస్‌లోకి ఈ విమానాల్ని అనుమతించడంలేదు. ఏ ఆపరేటర్ కూడా యూఏఈ నుంచి, యూఏఈ వరకు ఈ విమానాలు నడపడానికి వీల్లేదని ఇప్పటికే జీసీఏఏ ఓ ప్రకటనలో పేర్కొంది. మరికొన్ని దేశాలు కూడా ఈ విమానాలపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







