పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం
- March 14, 2019
38 ఏళ్ళ ఎమిరేటీ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. రస్ అల్ ఖైమాలో ఈ రోడు& డప్రమాదం జరిగింది. పొగమంచు ఎక్కువగా వుండడమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఎమిరేట్స్ రోడ్ రౌండెబౌట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్, ఉదయం 6.15 నిమిషాల సమయంలో ప్రమాద సమాచారాన్ని అందుకుంది. వెంటనే ట్రాఫిక్ పెట్రోల్స్, అంబులెన్సెస్, సివిల్ డిఫెన్స్, పారామెడిక్స్ అలాగే రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందు వెళుతున్న ట్రక్‌ని పొగమంచు కారణంగా గమనించని వ్యక్తి, తన వాహనంతో ఆ ట్రక్‌ని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పొగమంచు లో పరిమిత వేగంతో ప్రయాణించాలని హెచ్చరిస్తున్నా, వాహనదారులు నిబంధనలు పాటించడంలేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. కల్నల్ నక్బి మాట్లాడుతూ, వాహనదారులు అప్రమత్తంగా వుంటే చాలావరకు ప్రమాదాల్ని నివారించవచ్చునని చెప్పారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు