యూఎన్‌ఈఏలో కీలక పదవి గెలుచుకున్న బహ్రెయిన్‌

యూఎన్‌ఈఏలో కీలక పదవి గెలుచుకున్న బహ్రెయిన్‌

బహ్రెయిన్‌ కింగ్‌ డమ్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పోస్ట్‌ని యునైటెడ్‌ నేషన్స్‌ ఎన్విరాన్‌మెంట్‌ అసెంబ్లీ (యూఎన్‌ఈఏ)లో గెల్చుకుంది. ఏసియా పసిఫిక్‌ గ్రూప్‌కి ప్రాధాన్యం వహిస్తుంది ఈ పదవి. సుప్రీం కౌన్సిల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రెసిడెంట్‌, కింగ్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా ప్రతినిథి ఈ విషయాన్ని వెల్లడించారు. కింగ్‌డమ్‌కి సంబంధించినంతవరకు ఇది అత్యంత కీలకమైన అచీవ్‌మెంట్‌ అని ఆయన తెలిపారు. షేక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ, బహ్రెయిన్‌ అంతర్జాతీయ సమాజంలో సాధించిన అతి పెద్ద గెలుపుగా దీన్ని అభివర్ణించారు. ఆసియా పసిఫిక్‌ రీజియన్‌కి ప్రాతినిథ్యం వహించడం ద్వారా అరబ్‌ కంట్రీస్‌ తాలూకు ఎన్విరాన్‌మెంటల్‌ ఇంటరెస్ట్స్‌ని సెర్వ్‌ చేసే అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు. 

 

Back to Top