యూఏఈ న్యూ లేబర్ రూల్స్: మీరెలా తొలగింపబడవచ్చు?
- December 29, 2015
కొత్త సంవత్సరంలో కొత్తగా మూడు లేబర్ రూల్స్‌ని రాజ్యాంగ బద్ధంగా, అంతర్జాతీయ లేబర్ స్టాండర్డ్స్ ప్రకారం అమల్లోకి వస్తాయని మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ చైర్మన్ ఆఫ్ నేషనల్ క్వాలిఫికేషన్స్ అథారిటీ (ఎన్‌క్యుఎ) సక్ర్ ఘోబాష్ చెప్పారు. ఆ లేబర్ రూల్స్ ఏం చెబుతున్నాయి? అందులో ఏమేం ఉన్నాయో, సవివరంగా చూద్దాం.
ఎలా ఉద్యోగి సర్వీసులనుంచి తొలగించబడవచ్చు?
రెండో రూల్ ఉద్యోగి తొలగింపుపై స్పష్టతనిస్తుంది. ఇందులో ఆరు ముఖ్యమైన అంశాల్ని పేర్కొన్నారు. రెండేళ్ళకు మించని ఫిక్స్‌డ్ టెర్మ్ కాంట్రాక్టులకు సంబంధించి ఉద్యోగి తొలగింపు పలు కారణాలతో జరగడానికి ఈ రూల్ ఉపకరిస్తుంది.
1. ఒప్పంద కాలం ముగిసిన తర్వాత యజమాని, ఉద్యోగి పరస్పర అవగాహనతో ఒప్పందం రద్దు చేసుకోవచ్చు. రెన్యువల్‌కి ముందే ఇది జరగవలసి ఉంటుంది.
2. ఒప్పంద సమయంలోనే యజమాని, ఉద్యోగిని తొలగించాలన్నా, ఉద్యోగి యజమాని నుంచి విడిపోవాలన్నా పరస్పర అవగాహన కలిగి ఉంటే అప్పుడూ తొలగింపు వీలవుతుంది.
3. రెన్యువల్ సమయంలో యజమాని లేదా ఉద్యోగి ఒప్పందాన్ని పరస్పర అవగాహన లేపోయినా రద్దు చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత వచ్చే లీగల్ ఇబ్బందుల్ని రద్దు కోరినవారే భరించాల్సి ఉంటుంది.
4. ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలంటే దానికీ కొన్ని అవకాశాలున్నాయి.
ఎ. రద్దు చేసుకోవాలనుకున్నవారు నెల రోజులకు తక్కువ కాకుండా, మూడు నెలలకు మించకుండా ఈ మధ్య సమయంలో సవివరణాత్మక నోటీసును ఇవ్వవలసి ఉంటుంది.
బి. నోటీసు ఇచ్చిన తర్వాత ఇరువురి మధ్యా సయోధ్య కుదరని పక్షంలో, నోటీసు పరిమితి కాలం మూడు నెలలుగా పరిగణించబడ్తుంది. ఒప్పందం రద్దు చేసుకోవడానికి తగిన సొమ్మును చెల్లించవలసి ఉంటుంది.
సి. కాంపెన్సేషన్ విషయంలో సరైన అఅవగాహన రాని పక్షంలో అది మూడు నెలల జీతానికి మించకూడదు.
5. యజమాని లేదా ఉద్యోగి చట్టపరమైన నిబంధనల పరంగా నడుచుకోకుండా విడివిడిగా ఒప్పందాలు రద్దు చేసుకుంటే, ఆ రద్దు చెల్లదు.
6. ఆర్టికల్ 120 ల్యాబర్ రెగ్యులేటరీ యాక్ట్ ప్రకారం ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలకు ఉద్యోగి పాల్పడితే, ఒప్పందం రద్దవుతుంది.
అపరిమిత ఒప్పందాల విషయంలో...
ఉద్యోగి, యజమాని మధ్య అపరిమిత కాల ఒప్పందాలు జరిగి ఉంటే, నాలుగు సందర్భాల్లో వాటిని రద్దు చేసుకోవచ్చు.
1. ఇరు వర్గాలూ పరస్పర అవగాహనతో రద్దు చేసుకుంటే
2. కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలనుకున్న పార్టీ నెల రోజులకు తగ్గకుండా 3 నెలలకు మించకుండా ముందస్తు నోటీసు ఇవ్వడం ద్వారా, ఆ నోటీసు కాలంలో తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు.
3. ఒక పార్టీ కాంట్రాక్టును రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుని, చట్టపరమైన అవకాశాలను ఆశ్రయించకుండా ఉంటే, అలాంటి సందర్భాల్లో కాంట్రాక్టు రద్దవుతుంది, అలాగే రద్దు చేసుకున్న వ్యక్తి చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
4. లేబర్ రిలేషన్స్ రెగ్యులేటరీ యాక్ట్ 120 ఆర్టికల్ ప్రకారం ఏదైనా నేరానికి పాల్పడినప్పుడు ఆ పార్టీ కాంట్రాక్టు రద్దు అవుతుంది.
న్యాయస్థానాలను ఆశ్రయించడం
ఈ క్రింది సందర్భాలలో యజమాని లేదా ఉద్యోగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీలుంది.
1. యజమాని ఉద్యోగికి సకాలంలో వేతనాలు చెల్లించకపోవడం. (60 రోజులు దాటినా చెల్లించని పక్షంలో)
ఎ. ఉద్యోగులు మినిస్ట్రీకి ఫిర్యాదు చేస్తే, మినిస్ట్రీకి చెందిన ఇన్‌స్పెక్షన్ టీమ్, ఆ సంస్థలో వాస్తవ పరిస్థితుల్ని పరిశీలిస్తుంది.
బి. మినిస్ట్రీ ఆ ఫిర్యాదుని న్యాయస్థానానికి పంపిస్తుంది. న్యాయస్థానం అనుకూలమైన తీర్పును ఇస్తే, కాంట్రాక్టుని రద్దు చేయడంతోపాటు, రావాల్సిన జీతాన్ని సంస్థ నుంచి ఇప్పిస్తుంది.
ఈ రూల్స్‌ని ఘోబాష్, 300 మంది మినిస్ట్రీ ఉద్యోగులకు, లీగల్ స్కాలర్స్‌కి పంపించారు రివ్యూ కోసం. వారు వాటిని పరిశీలించి ఫీడ్ బ్యాక్ ఇవ్వనున్నారు.
--శాలెం బాబు,దుబాయ్(అడ్వకేట్)
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







