ప్రెస్టీజియస్ రోల్స్ రాయిస్ కారు ప్రభాస్ సొంతం
- December 29, 2015
బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాయటమే కాదు... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, ఇళయదళపతి విజయ్ లాంటి టాప్ స్టార్లు మాత్రమే వాడుతున్న ప్రెస్టీజియస్ రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకొని టాప్ ప్లేస్ లో నిలిచాడు. టాలీవుడ్ లో చాలా మంది హీరో ఖరీదైన లగ్జరియస్ కార్లను వాడుతున్నారు. అయితే వారందరినీ మించి ఏకంగా 8 కోట్లు ఖర్చు పెట్టి రోల్స్ రాయిస్ ఫాంతమ్ కారును తెప్పించుకున్నాడు ప్రభాస్.ఇటీవలే ఈ కారు డెలివరీ కావటంతో తన సన్నిహితులకు భారీ పార్టీ ఇచ్చాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బాహుబలి పార్ట్ 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాను 2016 డిసెంబర్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. బాహుబలి తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వల్ పై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







