పద్మశ్రీ పురస్కారం అందుకున్నరచయిత సిరివెన్నెల, హీరో మనోజ్..
- March 17, 2019
పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రధానం చేశారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1984లో కెరీర్ ప్రారంభించిన సిరివెన్నెల వందలాది సినీ గీతాలకు చక్కటి సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 నంది అవార్డులు అందుకున్నారు. నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. తాజాగా రాష్ట్రపతి కోవింద్ సిరివెన్నెలకు పురస్కారం ప్రధానం చేశారు.
జానపద గాయని తీజన్ భాయ్ రామ్‌నాథ్ చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. పద్మ భూషణ్ అందుకున్నవారిలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్, వాణిజ్యవేత్త ధర్మపాల గులాటీ, పర్వతారోహకురాలు బచేంద్రి పాల్ ఉన్నారు. ఇక పద్మశ్రీ అందుకున్నవారిలో హీరో మనోజ్ బాజ్‌పాయి, తబలా ఆర్టిస్ట్ సప్నా చౌదరీ, ఫుట్‌బాల్ ప్లేయర్ సునిల్ ఛత్రి, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, పబ్లిక్ అఫైర్స్‌లో హెచ్ ఎస్ ఫూల్కా, బాస్కెట్‌బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్‌లు ఉన్నారు. ఒడిశాకు చెందిన ఛాయ్‌వాలా డి. ప్రకాశ్ రావు రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కటక్‌కు చెందిన ప్రకాశ్, ఛాయ్ అమ్మగా వచ్చిన డబ్బుతో ఓ స్కూల్ నడుపుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







