కువైటీల ఫ్లాట్స్ వలసదారులకు అద్దెకివ్వొచ్చు
- March 19, 2019
కువైట్: లైసెన్స్‌డ్ ప్రైవేట్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లోని తమ అపార్ట్‌మెంట్స్‌ని సిటిజన్స్, వలసదారులకు వారి కుటుంబ సభ్యులకు అద్దెకివ్వడంలో ఎలాంటి ఇబ్బందీ లేదని ఇంజనీర్ అమ్మార్ అల్ అమ్మార్ (హెడ్ ఆఫ్ ది కమిటీ) స్పష్టతనిచ్చారు. అయితే ఈ విషయమై త్వరలో జరగనున్న కమిటీ మీటింగ్‌లో చర్చించే అవకాశం లేదనీ, ఈ కమిటీ రియల్ ఎస్టేట్స్ - బ్యాచిలర్స్ - రెంటింగ్ అంశంపైనే చర్చిస్తుందని చెప్పారాయన. ఏప్రిల్ 1న జరిగే సమావేశం కోసం అన్ని వివరాలూ, నివేదికలూ సిద్ధం చేయాలని మునిసిపాలిటీ బ్రాంచీలకు ఆదేశించామని ఇంజనీర్ అల్ అమ్మార్ పేర్కొన్నారు. మునిసిపాలిటీ టీమ్స్, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ - బ్యాచిలర్స్ - రెంటింగ్ అంశంపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారాయన.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







