వినరా సోదర వీరకుమారా రివ్యూ

- March 22, 2019 , by Maagulf
వినరా సోదర వీరకుమారా రివ్యూ

విడుదల తేదీ : మార్చి 22, 2019
నటీనటులు : శ్రీ‌నివాస్‌ సాయి, ప్రియాంక జైన్, ఉత్తేజ్‌, ఝాన్సీ, జెమిని సురేష్‌, ర‌విరాజ్‌, ప‌వ‌న్‌ర‌మేష్‌, స‌న్ని, రోష‌న్‌ త‌దిత‌రులు.
దర్శకత్వం : స‌తీష్ చంద్ర‌ నాదెళ్ళ‌.
నిర్మాత : ల‌క్ష్మ‌ణ్‌ క్యాదారి
సంగీతం : శ్ర‌వ‌ణ్‌ భ‌ర‌ద్వాజ్‌
సినిమాటోగ్రఫర్ : ర‌వి.వి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్

- ADVT -

 
ప్రేమకథలు ఏ బ్యాక్ డ్రాప్ లో అయినా చెప్పవచ్చు. యూనివర్సల్ గా కనిపించే ఈ ఎమోషన్ చుట్టూ చాలా కథలు తెరమీదకు వచ్చాయి. ప్రేమికుల్ని చంపి అయినా ప్రేమను గెలిపించాయి. అలాంటి ప్రేమ కథలకు భిన్నగా వచ్చిన సినిమా నే వినరా సోదర వీరకుమారా. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ:
ఊళ్ళో ఆటో నడుపుకునే రమణ (శ్రీనివాస్ సాయి) తన ఊరిలో జరిగన గొడవ కారణంగా ఆ ఊరిని వదిలి పెట్టి కుటుంబంతో సహా మరో ఊరికి వస్తాడు. అక్కడ ఆటో నడుపుకుంటూ తన కొత్త జీవితం మొదలుపెడతాడు. ఆ ఊరిలో బి. టెక్ చదివే సులోచన( ప్రియాంక జైన్ ) తో పరిచయం అవుతుంది. తన ఆటోలో రోజూ కాలేజ్ కి వెళ్ళే ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. తన మీద సులోచనకు కూడా ప్రేమ ఉందని తెలిసే లోపు రమణ జీవితంలోకి ఒక ఆత్మ వస్తుంది. ఆ ప్రేమలో విఫలం అయి చనిపోయిన ఆ కుర్రాడు తన చివరి కోరిక తీర్చమని రమణను కోరతాడు. అక్కడి నుండి రమణ జీవితం మరో రకంగా మారుతుంది. ప్రేమలో విఫలం అయిన కుర్రాడి ఆత్మ ఏ కోరుకుంది..? తను కోరుకున్న అమ్మాయి తో రమణ ప్రేమ పెళ్ళి వరకూ వచ్చిందా లేదా అనేది మిగిలిన కథ..?

కథనం:
ప్రేమించడం లేదా ప్రేమించబడటం అనది యూత్ కి స్టేటస్ సింబల్ గా మారింది. ప్రేమకోసం చంపడం లేదా చావడం కూడా హీరోయిజంగా మారింది. ఈ రెండు అభిప్రాయాలకు ఉన్న విలువ జీవితానికి ఉందా…? అనే ప్రశ్ననుండి ఈ సినిమా కథ మొదలవుతుంది. కంటికి నచ్చిన అమ్మాయిని ప్రేమించడం, తనతో కూడా ప్రేమించడ పడటం అనేది కుర్రతనానికి కిక్ ఇస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ కిక్ మాత్రమే జీవితం కాదనే విషయాన్ని సూటిగా చెప్పాడు దర్శకుడు సతీష్ చంద్ర. కంచెరపాలం లాంటి సినిమాలకు బ్రహ్మరధం పట్టిన ప్రేక్షకులకు అలాంటి మేకింగ్ తో వచ్చిన వినరా సోదర వీర కుమారా కూడా అలాంటి అనుభవాన్నే మిగిలుస్తుంది. రమణ అనే ఆటో డ్రైవర్ జీవితాన్ని తీసుకోని యూత్ కనెక్ట్ అయ్యే పాయింట్ ని చాలా కన్వెన్సింగ్ గా చెప్పాడు దర్శకుడు. అతను రాసుకున్న కథకు లక్ష్మీభూపాల్ మాటలు నిండుతనం తెచ్చాయి. శ్రీనివాస్ సాయి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి రమణ తో పాటు కాన్సెప్ట్ కి కూడా ప్రాణం పోసాడు. ఒక మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ అందించే నటనను చాలా ఎఫెక్టివ్ గా అందించాడు. సులోచన క్యారెక్టర్ లో ప్రియాంక జైన్ చాలా చక్కగా కుదిరింది. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ పాత్ర చాలా మందికి ఐడెంటిఫై అవుతుంది. పెద్దగా సినిమాటిక్ లిబర్టీని వాడుకోకుండా రియలిస్టిక్ అప్రోచ్ తో ఈ కథనం సాగుతుంది. హీరో, హీరోయిన్ల మద్య ప్రేమను ఎస్టాబ్లష్ చేసేందుకు తక్కువ స్పేస్ ఉన్నా దర్శకుడు వాటిని చాలా గొప్పగా వాడుకున్నాడు. ‘ఒకసార హీరోయిన్ బస్ ఎక్కుతుంది, హీరో కూడా అదే బస్ ఎక్కుతాడు, నువ్వు బస్ ఎక్కితే నేను దిగిపోతా అంటుంది. హీరో ఆ బస్ వెంట పరిగెడుతూ వెళుతుంటాడు. అతని ప్రేమలో సిన్సియారిటీని, హీరోయిన్ కు ఉన్న అడ్డుగోడలను ఆ ఒక్క సీన్ తో దర్శకుడు బాగా ఎలివేట్ చేసాడు. ప్రేమించినా, ఆ ప్రేమను చెప్పలేని పరిస్థితి హీరోయిన్ ది అయితే ప్రేమిస్తుందని తెలిసినా ఆ ప్రేమను పొందలేని పరిస్థితి హీరోది. వీరి ప్రేమ కథలోకి ఎంటరయిన ఒక ఆత్మ ప్రేమ కథ ఈ కథకు కొత్త టర్న్ ఇస్తుంది. అక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది. ఆ పాత్ర తో ఆడియన్స్ ని కనెక్ట్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న విధానం కొంత ఇబ్బందిని కలుగ జేసింది. ప్రేమించకపోతే, చావడం చంపడం వంటి విపరీతమైన ధోరణులను పూర్తిగా మార్చే ఆలోచనలు కలిగించేందుకు దర్శకుడు కొన్ని పాత్రలతో చేసిన ప్రయాణం చాలా బాగుంది. సినిమాకి సామాజిక ప్రయోజనం ఉందని నమ్మే దర్శక నిర్మాతల నుండి వచ్చిన రియలిస్టిక్ సినిమా గా వినరా సోదర వీరకుమారా గుర్తుండిపోతుంది. శ్రవణ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ పనితనం ఈ కథను మరింత అందంగా ఆసక్తిగా మలిచాయి.

చివరిగా:
కంచెరపాలం తరహాలో రియలిస్టిక్ గా సాగే ప్రేమకథ లో భావోద్వేగాలు కట్టిపడేసాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com