తొలి మహిళా సౌదీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌

- March 22, 2019 , by Maagulf
తొలి మహిళా సౌదీ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌

జెడ్డా: సౌదీ ఎయిర్‌ నేవిగేషన్‌ సర్వీసెస్‌ (ఎస్‌ఎఎన్‌ఎస్‌), తొల బ్యాచ్‌ మహిళా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్స్‌ అపాయింట్‌మెంట్‌, వర్క్‌ స్టార్ట్‌ని సెలబ్రేట్‌ చేసుకోవడం జరిగింది. జెడ్డాలోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌లో వీరు విధుల్ని ప్రారంభించారు. మొత్తం 11 మంది మహిళలు ఏడాది ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ని పూర్తి చేసుకున్నారు. ఎస్‌ఎఎన్‌ఎస్‌ ఈ శిక్షణను సౌదీ అకాడమీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌తో కలిసి అందించింది. మహిళల్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ కోసం తొలిసారిగా శిక్షణ ఇచ్చిన కార్యక్రమం ఇది. విజన్‌ 2030లో భాగంగా ఈ ఇనీషియేటివ్‌ని ప్రారంభించారు. మహిళల్ని అన్ని రంగాల్లోనూ ప్రోత్సహించేందుకుగాను ఈ అద్భుతమైన కార్యక్రమం చేపట్టామనీ, మహిళా లోకం నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు అంటున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com