సిద్ధమౌతోన్న ఏపీ ఓటర్ల జాబితా
- March 23, 2019
సార్వత్రిక ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో ఏపీలో అధికారులు ఓటర్ల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాకు ఇప్పటివరకు అందిన సవరణలతో అనుబంధ జాబితాను సిద్ధం చేస్తున్నారు. నామినేషన్ల చివరి తేదీ నాటికి ఓటర్ల జాబితాను ఖరారు చేయాల్సి ఉండటంతో మార్పులు, చేర్పుల ప్రక్రియ వేగంగా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా సిద్ధమవుతోంది. పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయనే ఆరోపణల్ని తోసిపుచ్చుతూ సుమారు 4 కోట్లకు చేరువలో ఏపీ ఓటర్ల రెడీ అవుతోంది. జనవరి 11న ప్రకటించిన తుది జాబితాలో 3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లున్నారు. తాజాగా కొత్త మరో 25లక్షల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో ఓట్లను తొలగించాలంటూ దాదాపు 9లక్షల 40వేల దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. వీటన్నింటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తర్వాత లక్షన్నర ఓట్లను మాత్రమే తొలగించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది.
జిల్లాల వారీగా చూస్తే ఓట్ల తొలగింపును చూస్తే శ్రీకాకుళంలో 2579, విజయనగరంలో 5166, విశాఖపట్నంలో 2407, పశ్చిమ గోదావరిలో 8669, ప్రకాశంలో 6040, నెల్లూరులో 3850 , కడపలో 5292, కర్నూలులో 7684, అనంతపురం 6516 ఓట్లను తొలగించారు. అత్యధికంగా ఓట్లను తొలగించిన జిల్లాలను చూస్తే, గుంటూరులో 35,063, తూర్పు గోదావరిలో 24,190, కృష్ణాలో 19,774, చిత్తూరులో 14,052 ఓట్లను తీసివేశారు. ఒకే పేరు మీద వేర్వేరు చోట్ల ఓట్లు ఉండటం, పేరు, వయసు, తండ్రి పేరు, ఇంటి నెంబరు ఒకేలా ఉన్న వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరితో పాటు బూత్ లెవల్ ఆఫీసర్ల క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా మరణించిన ఓటర్లను గుర్తించి తొలగించారు.
ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే, నెల్లూరు రూరల్లో ఒక్క ఓటు కూడా తొలగించలేదు. విశాఖ ఉత్తరం., అనంతపురం అర్బన్ నియోజక వర్గాలలో కేవలం ఒకే ఒక్క ఓటును తొలగించారు. బాపట్లలో 4 ఓట్లు, నంద్యాలలో 5 ఓట్లు, మాడుగులలో 8 ఓట్లు, ఉదయగిరి 9 ఓట్లు, రాప్తాడు, తణుకులలో 10 ఓట్లను మాత్రమే తొలగించారు. ఇక అత్యధికంగా ఓట్లు తొలగించిన నియోజక వర్గాలలో రేపల్లెలో 4425ఓట్లు, నందిగామలో 4746 ఓట్లు., జగ్గయ్యపేటలో 3111 ఓట్లు., మాచర్లలో 3528 ఓట్లు, ధర్మవరంలో 3180ఓట్లు తొలగించారు. రెండు వేలకు పైగా ఓట్లు తొలగించిన నియోజక వర్గాలు కూడా గణనీయంగానే ఉన్నాయి.
మొత్తం మీద సాఫ్ట్ వేర్ తనిఖీలు, క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 41వేల 822 ఓట్లను మార్చి 22 నాటికి జాబితా నుంచి తొలగించారు. అదే సమయంలో దాదాపు 25 లక్షల ఫాం-6 దరఖాస్తులు ఎన్నికల సంఘానికి అందాయి. మార్పులు, చేర్పుల త్వరాత మార్చి 25 నాటికి తయారు చేసే జాబితాలో 3 కోట్ల 93 లక్షల ఓట్ల మంది ఓటర్లుండన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







