దుబాయ్ పోలీస్ ఓత్ సెర్మానీ: ఆకట్టుకున్న ఇండియన్ బాలిక
- March 23, 2019
భారతీయ బాలిక ఒకరు, దుబాయ్ పోలీస్ నిర్వహిస్తున్న హెమాయా స్కూల్‌లో ఓత్ టేకింగ్ సెర్మానీని లీడ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అరబిక్‌లో ఈ ఓత్ సెర్మానీకి ఆమె లీడ్ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరూ. అరబిక్ తన మాతృ భాష కాకపోయినా, అత్యద్భుతంగా అరబ్‌లో ఆమె మాట్లాడిన తీరుకి ఆశ్చర్యపోతున్నారంతా. హెమాయా స్కూల్‌లో నికోల్ విద్యనభ్యసిస్తోంది. దుబాయ్ పోలీస్ అధికారి ట్విట్టర్‌లో ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో నికోల్, ఆమె తండ్రి కన్పిస్తున్నారు. దుబాయ్ పోలీస్ ఇచ్చిన ట్రైనింగ్ చాలా అద్భుతమని వారు ఈ వీడియోలో చెప్పారు. హెమాయా స్కూల్ తనను ఎలా మార్చిందో అందులో నికోల్ వివరించడం జరిగింది. దుబాయ్ పోలీస్ - మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ది నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ సంయుక్తంగా ఈ స్కూల్‌ని నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులకు ఇక్కడ ఉచితంగా విద్యను అందిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







