పాక్ లో హిందూ అమ్మాయిల కిడ్నాప్ కలకలం..
- March 25, 2019
పాకిస్థాన్‌లో హిందూమతానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్ల అపహరణ-బలవంతపు మతమార్పిడి ఉదంతం తీవ్ర కల కలం రేపుతోంది. ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించే ప్రమాదమున్న నేపథ్యంలో 2 దేశాల ప్రభుత్వాలు సీరియస్‌గా స్పందించాయి. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక పంపాలని పాకిస్థాన్‌లోని భారత రాయ బారి ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ ఘటనపై మీడియా కథ నాలను పొందుపరుస్తూ పాక్‌లోని భారత హైకమిషనర్‌కు వివరాలు అందించారు. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దృష్టి సారించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో హోళీ పండుగ రోజున ఇద్దరు అక్కాచెల్లెళ్లు కిడ్నాపయ్యారు. ఘోట్కీ జిల్లా ధర్కి పట్టణంలో జిల్లాలో రవీనా, రీనాలను ఇంటి నుంచే కొందరు వ్యక్తులు అపహరించారు. తర్వాత వారికి వివాహం చేసి ముస్లిం మతంలోకి మార్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో కలకలం రేగింది. హిందూ బాలికలను అపహరించి బలవంతంగా మతం మార్చారంటూ హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. ఇందుకు కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







