వెదర్ అలర్ట్: డస్టీ వెదర్‌తో అప్రమత్తం
- March 26, 2019
నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ, యూఏఈ వాసులకు డస్టీ వెదర్ కండిషన్స్‌పై అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విజిబిలిటీ చాలా పూర్‌గా వుంటుందనీ, అది 2000 మీటర్లకు పడిపోయిందని ఎన్‌సిఎం స్పష్టం చేసింది. వాహనదారులు తమ వాహనాలు నడిపే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ - ఇ311 వద్ద ఓ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. తీర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుందని కూడా ఎన్‌సిఎం వెల్లడించింది. బుధవారం కొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతం కాగా, పలు చోట్ల ఇంకాస్త ఎక్కువగా మేఘాలు అలముకున్నాయి. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







