భారత్ చెప్పిన చోట ఉగ్రశిబిరాలు లేవు :పాక్

- March 28, 2019 , by Maagulf
భారత్ చెప్పిన చోట ఉగ్రశిబిరాలు లేవు :పాక్

న్యూఢిల్లీ: మీరు చెప్పిన 22 ప్రాంతాల్లో ఉగ్రవవాద శిబిరాలు లేవని పాక్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పుల్వామా దాడి పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థ పనే అంటూ ఫిబ్రవరి 27న పాకిస్థాన్ హై కమిషనర్‌కు భారత్ కీలకమైన పత్రాలను అందించింది. ఆ వెంటనే తాము విచారణ కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేశామని, పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించినట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతేకాదు అదుపులోకి తీసుకున్న 54 మందికి ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని తమ విచారణలో తేలినట్లు పాక్ స్పష్టం చేసింది. మీరు కోరితే ఆ 22 ప్రదేశాలకు స్వయంగా తీసుకెళ్లి చూపిస్తామని పాక్ విదేశాంగ శాఖ చెప్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com