అమెరికాపై మండిపోతున్న చైనా

- March 28, 2019 , by Maagulf
అమెరికాపై మండిపోతున్న చైనా

బీజింగ్ : ఐక్య రాజ్య సమితి (ఐరాస)ని అమెరికా బలహీనపరుస్తోందని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం చేస్తోందని దుయ్యబట్టింది.

మసూద్ అజహర్‌ను 1267 అల్‌ఖైదా శాంక్షన్స్ కమిటీ జాబితాలో చేర్చాలనే ప్రతిపాదనను చైనా నిలిపివేసిన సంగతి తెలిసిందే. చైనా ఈ చర్యకు పాల్పడినప్పటి నుంచి రెండు వారాల తర్వాత ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతుతో అమెరికా ఓ ముసాయిదా తీర్మానాన్ని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టింది. మసూద్‌ను ఈ జాబితాలో చేర్చాలని మరోసారి ప్రతిపాదించింది.

ఈ నేపథ్యంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి జెంగ్ షువాంగ్ స్పందించారు. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న అంశాన్ని అమెరికా మరింత జటిలం చేస్తోందని ఆరోపించారు. చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలన్న వైఖరికి అనుగుణంగా అమెరికా వ్యవహరించడం లేదన్నారు. ఈ చర్య ఐరాస భద్రతా మండలి యాంటీ టెర్రరిజం కమిటీ అధికారాలను తగ్గిస్తోందన్నారు. సంఘీభావానికి ఈ వైఖరి దోహదపడబోదని, సమస్యను మరింత జటిలం చేస్తుందని అన్నారు. ఈ ముసాయిదా తీర్మానాన్ని నిర్బంధంగా ప్రవేశపెట్టడానికి బదులు జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికాను కోరుతున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com