మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 60 కి.మీ.లు

- March 28, 2019 , by Maagulf
మార్కెట్లోకి మరో కొత్త బైక్.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 60 కి.మీ.లు

చూడ్డానికి అచ్చంగా సైకిల్లానే ఉంది. కానీ ఇది బ్రిటన్‌కు చెందిన గో-జీరో మొబిలిటీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ బైక్‌ని రూపొందించింది. మైల్, వన్ పేర్లతో రెండు బైకులను మార్కెట్లోకి తీసుకువచ్చింది. మైల్ ధర వచ్చి రూ.29,999, 300 వాట్ల లిథియమ్ బ్యాటరీని ఒక్కసారి రీచార్జి చేస్తే 45 కి.మీ., ఇక వన్ ధర విషయానికొస్తే రూ. 32,999గా ఉంది. దీనికి ఉన్న 400 వాట్ల లిథియమ్ బ్యాటరీని రీచార్జి చేయించుకుంటే దీంతో 60 కి.మీ ప్రయాణించవచ్చు.

ఈ బైకులను భారతదేశంలోనే తయారు చేసేందుకు వీలుగా కోల్‌‌కతాని ఎంచుకుంది. కీర్తి సోలార్ అనే కంపెనీతో చేతులు కలిపింది. గో-జీరో మొబిలిటీ సీఈవో అంకిత్ కుమార్ ఈ బైకులను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ.. విద్యుత్‌తో నడిచే వాహనాలను ప్రోత్సస్తున్న భారత్‌లో ప్రవేశించడం ఆనందంగా ఉందన్నారు. ఈ రెండు మోడళ్లతో పాటు డెలివ్ ఆర్, వన్ డబ్ల్యూ, జిరో స్మార్ట్ బైకులను కూడా అందుబాటులోకి రాబోతున్నాయని అన్నారు. మొదటి విడతలో భాగంగా ఢిల్లీ, కోల్‌కతా, గౌహతిలో ప్రారంభిస్తామన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా రానున్న మూడేళ్లలో 18 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com