ఎంట్రీ వీసా: భారత్‌ - కువైట్‌ మధ్య ఒప్పందం

- March 28, 2019 , by Maagulf
ఎంట్రీ వీసా: భారత్‌ - కువైట్‌ మధ్య ఒప్పందం

కువైట్‌ సిటీ: డిప్లమాటిక్‌, అఫీషియల్‌ మరియు స్పెషల్‌ పాస్‌పోర్ట్స్‌కి సంబంధించి మ్యూచువల్‌ ఎగ్జంప్షన్‌ ఆఫ్‌ ఎంట్రీ వీసాపై భారత్‌ - కువైట్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఫిబ్రవరి 19 నుంచి ఇది అందుబాటులోకి వచ్చినట్లు కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ పేర్కొంది. 2018 అక్టోబర్‌ 31న ఈ ఒప్పందం కుదిరింది. ఫస్ట్‌ ఆర్టికల్‌ ప్రకారం డిప్లమాటిక్‌, అఫీషియల్‌ మరియు స్పెషల్‌ విభాగాలకు ఇది వర్తిస్తుంది. ఆర్టిక్‌ 2 ప్రకారం ఆర్టికల్‌ పరిధిలోకి వచ్చే ఇరు దేశాలకు చెందిన పౌరులు, వీసా లేకుండానే ఆయా దేశాల్లోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ ద్వారా వీసా లేకుండానే 60 రోజుల పాటు వెళ్ళి, అక్కడ వుండేందుకు వీలు కలుగుతుంది. ఆర్టికల్‌ 4 ఆఫ్‌ ది అగ్రిమెంట్‌ ప్రకారం పైన పేర్కొనబడిన పాస్‌పోర్ట్స్‌ వున్నవారు తమ స్టేని పొడిగించుకోవడానికి సంబంధిత వర్గాలతో సంప్రదించాల్సి వుంటుంది. అయితే పాస్‌పోర్ట్‌ వ్యాలిడిటీ 6 నెలలకు మించి వుండాలి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com