లులు ఐలాండ్‌లో అగ్ని ప్రమాదం

- March 30, 2019 , by Maagulf
లులు ఐలాండ్‌లో అగ్ని ప్రమాదం

లులు ఐలాండ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మానవ నిర్మితమైన ఈ ఐలాండ్‌, అబుదాబీ కోస్ట్‌లో కొలువుదీరిన సంగతి తెల్సిందే. రెసిడెంట్స్‌, కోర్నిచ్‌ మీదుగా దట్టమైన పొగను గమనించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియడంలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయమూ తలెత్తలేదని మాత్రం అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే ఈ ప్రాంతానికి యాక్సెస్‌ లేకుండా ఏర్పాట్లు చేసింది సివిల్‌ డిఫెన్స్‌. మంటల్ని ఆర్పేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. అబుదాబీ నుంచి జాయెద్‌ సీపోర్ట్‌ వరకు బ్యాక్‌ వాటర్స్‌ ప్రాంతంలో లులు ఐలాండ్‌ నిర్మితమయ్యింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com