ఫ్రెండ్స్ ముందు డ్యాన్స్ చేయలేదని భార్య కాళ్లు కట్టేసి, నగ్నంగా..
- March 31, 2019
కట్టుకున్న భార్యతో అతి క్రూరంగా ప్రవర్తించాడు ఓ కసాయి భర్త. ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటినే ఏకంగా బార్లా మార్చాడు. దోస్తులతో కలిసి పీకలదాక తాగిన భర్త రెచ్చిపోయాడు.
ఆ ఇల్లాలుని కూడా మద్యం తాగమని బలవంతం చేశాడు. ఫ్రెండ్స్ ముందు డాన్స్ చేయమని ఆమెను ఒత్తిడి చేశాడు. అలా చేయడానికి ఆమె నో చెప్పడంతో.. భర్తకు ఆగ్రహాం కట్టలు తెచ్చుకుంది. ఫ్రెండ్స్ ముందు తన మాటకు విలువ ఇవ్వలేదని.. ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఆమె కాళ్లు కట్టేసి అతి నీచంగా ప్రవరించాడు. ఈ దారుణం పాకిస్తాన్లో చోటుచేసుకుంది.
లాహోర్‌కు చెందిన మియాన్ ఫైసల్ అనే వ్యక్తితో ఆమెకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే డ్రగ్స్‌కు బానిసైన ఫైసల్ ఆమెను వేధించటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఫ్రెండ్స్‌ని మియాన్ ఫైసల్ ఇంటికి తీసుకువచ్చాడు. దోస్తులతో కలిసి పుల్గా మందు కొట్టిన ఫైసల్.. తన భార్యను డాన్స్ చేయమని బలవంతం చేశాడు. ఆయన ఫ్రెండ్స్ ముందు డాన్స్ చేయడానికి ఆమె ససేమీరా అంది.
దీంతో ఫ్రెండ్స్ ముందు తనకు అవమానం జరిగిందని భావించాడు భర్త. కోపంతో ఆమెను కట్టేసి గుండు కొట్టాడు. భర్త పెట్టే బాధలు భరించలేక ఆమె ఇంట్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. దీంతో తన కాళ్లు కట్టేసి నగ్నంగా మార్చాడని బాధితురాలు..
తన బాధను వీడియో ద్వారా జడ్జికి పంపింది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తే.. పోలీసులు రూ.5000 అడిగారని వీడియోలో బాధితురాలు బోరున ఏడుస్తూ చెప్పింది. అయితే, ఆమె చేస్తున్న ఆరోపణలను భర్త ఖండించాడు. ఇద్దరం డ్రగ్స్‌కు బానిస అయిపోయామని తెలిపాడు. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో తమ ఇద్దరికీ తెలియదని చెప్పటం విశేషం.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







