మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- April 01, 2019
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ45 రాకెట్‌ను సోమవారం నింగిలోకి పంపనున్నారు. రాకెట్ డీఆర్డీవోకు చెందిన ఎలక్ట్రానిక్ ఇంటిలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన 28 గంటల కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమైంది. ఇది నిర్విరామంగా ఈరోజు ఉదయం 9.27 వరకు కొనసాగుతుంది. అనంతరం రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఇది మూడు వేర్వేరు కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. డీఆర్డీవోకు చెందిన 436 కిలోల బరువున్న ఇమిశాట్‌ను 749 కిలోమీటర్ల ఎత్తులో, విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను 504 కిలోమీటర్ల ఎత్తులో నిలుపుతారు. ఆ తర్వాత రాకెట్ నాలుగో దశ నెమ్మదిగా 485 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని అక్కడే కక్ష్యలో తిరుగుతుంది.
నాలుగో దశలో మైక్రో గ్రావిటీ వాతావరణాన్ని ఏర్పరచి వివిధ పరిశోధనలు చేపట్టనున్నారు. మొదటి పేలోడ్‌లోని ఇస్రో రూపొందించిన ఆటోమెటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సముద్ర జలాలపై ప్రయాణించే నౌకల ద్వారా వచ్చే సమాచారాన్ని సేకరించనుంది. అలాగే రెండో పేలోడ్‌లో ఆటోమేటిక్ ప్యాకెట్ రిపీటింగ్ సిస్టమ్‌లోని రేడియో అమెచ్యూర్ శాటిలైట్ కార్పొరేషన్ ప్రయోగాత్మకంగా కొన్ని పెలోడ్లను ఉంచి అధునాతన సాంకేతికతకు సంబంధించి పరిశోధనలు చేయనుంది. మూడో పేలోడ్‌లో అడ్వాన్స్డ్ రిటార్డింగ్ పొటెన్షియల్ అన్‌లైజర్ ఫర్ ఐనోస్పిరిక్ స్టడీస్‌ను ఐఐఎస్టీ రూపకల్పన చేసింది. దీని ద్వారా ఐనోస్పియర్‌పై పరిశోధనలు చేయనున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







