భార్య తనను పట్టించుకోవడం లేదని..

- April 01, 2019 , by Maagulf
భార్య తనను పట్టించుకోవడం లేదని..

అమెరికా:ర్త కంటే పెంపుడు శునకానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది భార్య. దీంతో భర్త శునకంలా మారాలనుకున్నాడు. తన్ను తాను శునకంలా ఊహించుకున్నాడు. శునకంలా మారిపోయాడు. ఇప్పడు అతను మనిషి కాదు.. అలాగని జంతువు కాదు. శునకంలా ప్రవర్తించే మనిషి. ఇవి చంద్రముఖి సినిమాలోని డైలాగులు కాదు.. హాలీవుడ్ మూవీ ‘ది యానిమల్’ స్టోరీ అంత కన్నా కాదు.. అమెరికాలో నివసించే ఓ వ్యక్తి వ్యథ.

ఫ్లోరిడాలోని ఓ వ్యక్తి, రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు యువకులపై దాడి చేశాడు. శునకంలా కరిచి.. కండ పీకేశాడు. అతని ప్రవర్తనకు షాక్ తిన్న స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. యువకులపై దాడిచేసింది 22 ఏళ్ల హార్‌ఆఫ్‌గా గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని.. విచారణ చేపట్టారు. అయితే అతని ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు హార్‌ఆఫ్‌ ఒక వింత జబ్బుతో భాదపడుతున్నాడని గ్రహించారు. అందుకే అతను శునకంలాగా ప్రవర్తిస్తున్నాడని తేల్చారు. కాలు ఎత్తి, గోడల మీద టాయిలెట్ చేయడం.. కొత్తవారు కనిపిస్తే మొరగడం.. అనుమానం వస్తే దాడి చేయడం.. వంటివి తన మానసిక రుగ్మతలోని భాగమేనన్నారు.

జాబ్‌లో మానసిక ఒత్తిడికి లోనవ్వడం. అతని భార్య తనకంటే తన పెంపుడు శునకంతోనే ఎక్కువ సమయం గడపడం, తనను ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం.. హార్ఆఫ్‌ వింత ప్రవర్తనకు ఓ కారణమని సైకాలజిస్టులు అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com