9వ తరగతి విద్యార్థులకు ఓ చక్కని అవకాశం.. ఇస్రోలో సమ్మర్ కోర్స్..
- April 01, 2019
మీ పిల్లలు 8వ తరగతి పాసై తొమ్మిదిలోకి అడుగుపెట్టారా. అయితే ఈ సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఇస్రో. వారిని ఈ వేసవి సెలవుల్లో ఇస్రో చేపట్టే యువ విజ్ఞాన కార్యక్రమ్‌లో చేర్పించొచ్చు. అంతరిక్ష సాంకేతిక వైజ్ఞానిక అంశాలు, దీనికి సంబంధించిన ప్రయోగాలు వంటి అంశాలపై హాలిడేస్‌లో పిల్లలకు అవగాహన కల్పించనున్నారు నాసా వారు. ఈ కోర్సుకి ఎంపికైన వారికి మే నెలలో ఉచిత ఓరియంటేషన్ తరగతులు, నిపుణులతో చర్చా కార్యక్రమాలు ఉంటాయి.
దేశంలోని 4 ఇస్రో కేంద్రాల్లో రెండు వారాల పాటు ఈ కోర్సు నేర్పిస్తారు. హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. ఇందుకోసం ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ముగ్గురు ఆసక్తి గల విద్యార్థులను ఎంపిక చేస్తారు. గ్రామీణ విధ్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.
అర్హత: 8వ తరగతి పరీక్షల్లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
ఆసక్తి గల విద్యార్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అయి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: http://yuvika.isro
రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేది: ఏప్రిల్ 3, 2019.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







