ఆన్‌లైన్‌ హజ్‌ అప్లికేషన్లకు మాత్రమే అవకాశం

- April 01, 2019 , by Maagulf
ఆన్‌లైన్‌ హజ్‌ అప్లికేషన్లకు మాత్రమే అవకాశం

మస్కట్‌: ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ ద్వారా కాకుండా ఇంకే విధంగానూ హజ్‌ అప్లికేషన్లు ఉపయోగపడవని మినిస్ట్రీ ఆఫ్‌ ఎండోవ్‌మెంట్‌ అండ్‌ రెలిజియస్‌ ఎఫైర్స్‌ పేర్కొంది. ఆన్‌లైన్‌ స్టేట్‌మెంట్‌ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఏప్రిల్‌ 1 ఉదయం 10.25 నిమిషాల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని పక్షంలో హజ్‌ యాత్రకు వెళ్ళే అవకాశం వుండదు. కాగా, మార్చి 11 నుంచి మార్చి 22 వరకు ఆన్‌లైన్‌ ద్వారా హజ్‌ కోసం దరఖాస్తుల్ని స్వీకరించనున్నట్లు మినిస్ట్రీ ప్రకటించిన విషయం విదితమే. మినిస్ట్రీ కండిషన్స్‌ ప్రకారం 18 ఏళ్ళ లోపు వయసున్నవారికి హజ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం లేదు. నాన్‌ ఒమన్‌ రెసిడెంట్స్‌ సుల్తానేట్‌లో కనీసం ఏడాది నివసిస్తున్నట్లయితేనే దరఖాస్తు చేసుకోవచ్చు. దానికి తోడు, ఇంతకు ముందు సుల్తానేట్‌ నుంచి వారు హజ్‌కి వెళ్ళి వుండకూడదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com